‘నువ్‌ పులి అయితే నాకేంటి.. ఇది నా అడ్డా’.. కోతి తెలివికి టైగర్‌ పరార్‌!

30 Sep, 2022 21:29 IST|Sakshi

పెద్ద పులి కనిపిస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. కానీ, ఓ కోతి మాత్రం నువ్‌ పులి అయితే.. నాకేంటి ఇది నా అడ్డా చూసుకుందాం రా.. అన్న విధంగా ప్రవర్తించింది. తన కోతి చేష్టలతో పులినే ఒక ఆట ఆడుకుంది. వానరాన్ని వేటాడేందుకు పులి ప్రయత్నించి చెట్టుపై నుంచి పడిపోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

వీడియో ప్రకారం.. చెట్టుపై ఉన్న ఓ కోతిని వేటాండెందుకు పులి ప్రయత్నించింది. చిటారు కొమ్మన ఉన్న వానరాన్ని పట్టుకునేందుకు పులి సైతం చెట్టుపైకి ఎక్కింది. కొమ్మలపై అటూ ఇటూ అలవోకగా దూకటం కోతులకు పుట్టుకతో వచ్చే విద్య. అదే నైపుణ్యంతో పులిని ఆటాడుకుంది కోతి. చేతికి అందినట్లు అంది మరో కొమ్మపైకి దూకుతూ పులికి ముచ్చెమటలు పట్టించింది. ఈ వీడియోను ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షా 74 వేల మంది వీక్షించారు. 8,300 లైకులు వచ్చాయి. 

ఇదీ చదవండి: జీవితాంతం చదువుకుంటూ వృద్ధుడిగా మారిపోతా.. పిల్లాడి మాటలకు నెటిజన్లు ఫిదా

మరిన్ని వార్తలు