Monkeypox In India: మంకీపాక్స్‌ టెర్రర్‌.. దేశంలో మరో పాజిటివ్‌ కేసు.. ఎక్కడో తెలుసా..?

1 Aug, 2022 22:35 IST|Sakshi

Monkeypox Positive Case.. దేశంలో మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కేసులు క్రమంగా పెరుగుతుండటం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. ఢిల్లీలో ఉండే నైజీరియన్‌ వ్యక్తికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడికి సోమవారం జరిపిన టెస్టుల్లో మంకీపాక్స్‌ పాజిటివ్‌గా తేలినట్టు కేంద్రం ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుతో దేశంలో మంకీపాక్స్‌ కేసుల సంఖ్య 6కు చేరింది. ఇప్పటి వరకు ఢిల్లీలో 2, కేరళలో 4 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా.. దేశంలో మంకీపాక్స్‌తో కేరళకు చెందిన యువకుడు(22) మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, యువకుడి మృతి నేపథ్యంలో 20 మందిని ప్రస్తుతం క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా అందరినీ క్వారంటైన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే, మృతుడికి కేవలం పది మందితోనే కాంటాక్ట్‌ ఉన్నదని అధికారులు ధ్రువీకరించారు. 

ఇది కూడా చదవండి: మంకీపాక్స్‌ పాజిటివ్‌ అని తెలిసినా గప్‌చుప్‌గా భారత్‌కు!

మరిన్ని వార్తలు