మద్యాన్ని జుర్రుకున్న కోతులు!

9 Apr, 2021 11:25 IST|Sakshi

విజయపుర: ఆకలిగొన్న కోతులకు మద్యం, నీటి ప్యాకెట్లు కంటపడ్డాయి. అంతే ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని చేజిక్కించుకున్న వానరాలు వాటిని జుర్రుకొన్నాయి. ఈ ఘటన బెంగళూరు రూరల్‌ విజయపుర పట్టణంలో జరిగింది. బయట తిరుగాడుతున్న కోతులకు ఒక బార్‌ ముందు పడేసిన మద్యం ప్యాకెట్లు, నీటి పొట్లాలు కనిపించగా, వాటిలో మిగిలిఉన్న ద్రవాలను ఆస్వాదించాయి. ఈ దృశ్యాలను కొందరు మొబైల్‌ఫోన్లలో బంధించి ‘కోతుల పార్టీ’ అని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

చదవండికవలలను ఎత్తుకెళ్లిన కోతులు.. ఆతర్వాత ఏం చేశాయంటే..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు