-

రెండోసారి కరోనా.. మరింత తీవ్రం

14 Oct, 2020 05:02 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండోసారి కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులకు మరింత తీవ్ర లక్షణాలు కనిపించే అవకాశమున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. అమెరికాలో ఎటువంటి ఇతర వ్యాధులేవీ లేని ఒక పాతికేళ్ల వ్యక్తికి 48 రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా సోకిందని లాన్సెట్‌ పత్రిక ప్రకటించింది. అతడికి రెండోసారి కరోనా సోకినప్పుడు వ్యాధి లక్షణాలు మరింత తీవ్రంగా ఉన్నాయని, కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్‌ నెవాడాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని అధ్యయనం సూచించింది. కోవిడ్‌ నుంచి రికవరీ అయిన వారి శరీరంలో తయారయ్యే యాంటీబాడీల జీవితకాలంపై కచ్చితమైన సమాచారం ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద కూడా లేదని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ తెలిపారు. 

మరిన్ని వార్తలు