కొత్త అసెంబ్లీల్లో పెరిగిన మహిళా ప్రాతినిథ్యం

14 Mar, 2022 06:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఎంఎల్‌ఏల ప్రాతినిథ్యం పెరిగింది. గత అసెంబ్లీలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మహిళా ఎంఎల్‌ఏల సంఖ్య  పెరిగిందని పీఆర్‌ఎస్‌ రిసెర్చ్‌ సంస్థ తెలిపింది. 2017లో యూపీ అసెంబ్లీలో 42 మంది మహిళా ఎంఎల్‌ఏలు ఉండగా ప్రస్తుతం వీరి సంఖ్య 47కు పెరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో మహిళా ఎంఎల్‌ఏల సంఖ్య 5 నుంచి 8కి, మణిపూర్‌లో 4 నుంచి 8కి పెరిగింది.

ఎంఎల్‌ఏలుగా ఎన్నికైన వారిలో 55 సంవత్సరాలు నిండినవారి సంఖ్య పెరిగింది. మరోవైపు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో వయసులో పెద్దవారైన ఎంఎల్‌ఏల సంఖ్య పెరిగింది. 55 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఎంఎల్‌ఏల సరాసరి 2017లో 64.7 శాతం ఉండగా, 2022కు 59.5 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. కనీసం డిగ్రీ అర్హత ఉన్న ఎంఎల్‌ఏల వాటా యూపీలో 72.7 నుంచి 75.9 శాతానికి పెరగ్గా, ఉత్తరాఖండ్‌లో 77 నుంచి 68 శాతానికి, మణిపూర్‌లో 76 నుంచి 68 శాతానికి తగ్గిందని సంస్థ వెల్లడించింది.

మరిన్ని వార్తలు