ఐటీ సిటీకి ప్రవాసుల క్యూ.. ఇక్కడే కొనుగోళ్లు ఎందుకంటే

6 Apr, 2021 08:15 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: నివాస యోగ్యమైన బెంగళూరు నగరం వైపు ఎన్నారై (ప్రవాస భారతీయులు) చూపు మళ్లింది. నివాసాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విలావవంతంగా ఉండే ఇళ్లంటే ప్రవాసులు మక్కువ చూపుతున్నారు. పెద్ద పెద్ద భవనాలు, మూడు లేదా నాలుగు పడకల ఇండిపెండెంట్‌ ఇళ్ల కొనుగోలుకు పోటీ నెలకొంది. వేసవి కాలంలోనూ చల్లగా ఉంటుందని పేరుండడంతో ఉద్యాననగరికి క్యూ పెరుగుతోందని పలు రియాల్టీ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. దేశానికి వస్తున్న ఎన్నారైలలో అత్యధికమంది బెంగళూరులోనే నివాసానికి మొగ్గు చూపుతున్నారట.  

వసతులే ముఖ్యం 
సుమారు 17 ఏళ్ల పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేసి తిరిగి స్వదేశానికి తిరిగొచ్చే వారిని ఎన్నారైలుగా పిలుస్తారు. అయితే వారు సొంతూరి కంటే అధిక వసతులు కూడిన సిలికాన్‌ సిటీలో స్థిర నివాసానికి సరే అంటున్నట్లు తెలుస్తోంది. తాము ఉండడానికి 3 – 4 పడకల గదుల ఇళ్లను, బాడుగలకు ఇచ్చి ఆదాయం పొందడానికి డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు.  

రెండో స్థానంలో పూణె
బెంగళూరు తర్వాత నివాసానికి ప్రవాసాలు పూణెను ఎంచుకున్నారు. రూపాయి విలువ క్రమక్రమంగా తగ్గిపోతున్న కారణంగా డాలర్లకు, పౌండ్లకు ఎక్కువ రూపాయలు వస్తున్నాయి. దీంతో ఎన్నారైలు భారత్‌లో ఆస్తులు కొనడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నారైలలో 73 శాతం మంది సగటున రూ.2.5 కోట్లతో ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు పేర్కొన్నాయి. కరోనాకు ముందు ఇది 41 శాతంగా ఉండేది.  

బెంగళూరులో ఎక్కడెక్కడ  
సర్జాపుర రోడ్డు, ఎలక్ట్రానిక్‌ సిటీ, బన్నేరుఘట్ట రోడ్డు, వైట్‌ ఫీల్డ్, నెలమంగల, కనకపుర రోడ్డు, మైసూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పూర్తిగా కట్టిన ఇళ్లంటేనే ఓకే అంటున్నారు.  

చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్
కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్‌బీఐ షాక్

మరిన్ని వార్తలు