పట్టు వదలక.. కొడుకుతో కలిసి పరీక్ష రాసిన తల్లి

30 Apr, 2022 15:34 IST|Sakshi

భువనేశ్వర్‌: తల్లీ, కొడుకులు తోటి విద్యార్థులుగా మెట్రిక్‌ పరీక్షలకు హాజరయ్యారు. జయపురం మండలం పూజారిపుట్‌ గ్రామంలో జ్యోత్స్న పాఢి(తల్లి), అలోక్‌నాథ్‌ పాత్రొ(కొడుకు) శుక్రవారం మెట్రిక్యులేషన్‌ పరీక్షలు రాశారు. తల్లి జయపురం ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో ఓపెన్‌ స్కూల్‌ అభ్యర్థిగా, కొడుకు పూజారిపుట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షలకు హాజరయ్యారు. భర్త త్రినాథ్‌ప్రసాద్‌ పాత్రొ ప్రోత్సాహంతో అర్ధాంతరంగా ముగించిన చదువును తిరిగి ప్రారంభించినట్లు జ్యోత్స్న తెలిపారు.

అసౌకర్యాల వెక్కిరంత! 
ఉత్తర ఒడిశాలో పలు కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు లేనట్లు ఆరోపణలు వినిపించారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందికరంగా పరీక్షలు రాయాల్సి వచ్చిందని నిరుత్సాహం వ్యక్తం చేశారు. వేసవి తాపంతో తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో పలు కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.  

చదవండి: Fake Baba At Uttarakhand: భూత వైద్యం పేరుతో మహిళను లొంగదీసుకొని.. ఆ తర్వాత..

మరిన్ని వార్తలు