పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం.. చివరికి ఇలా..

5 Jan, 2023 07:39 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తతో గొడవ పడ్డ ఓ భార్య తన ఇద్దరు పిల్లలను బావిలో పడేసి హతమార్చింది. ఆ పై తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. తెన్‌కాశి జిల్లా వాసుదేవ నల్లూరుకు చెందిన మురుగన్, మీనా దంపతులు గతంలో ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు.  తర్వాత పెద్దల సహకారం లేకుండానే ఈ దంపతులు జీవనం సాగిస్తూ వచ్చారు. వీరికి త్యాగు మీనా(6), ముఖీషా(2) అనే కుమార్తెలున్నారు. ఇటీవల కాలంలో దంపతుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. ఇరుగు పొరుగు వారు సర్ది చెప్పే వారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం మౌనంగా ఇంటి నుంచి మురుగన్‌ బయటకు వెళ్లి పోయాడు. 

బావిలో మృతదేహాలు.. 
అర్ధరాత్రి ఇంటికి వచ్చిన మురుగన్‌.. భార్య, పిల్లలు కనిపించక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో ఆ పరిసరాల్లో గాలించాడు. బుధవారం వేకువజామున గ్రామ శివార్లలో ఉన్న పాడు బడ్డ బావిలో త్యాగుమీనా, ముఖీషా మృతదేహం బయట పడింది. అగి్నమాపక సిబ్బంది మీనా మృతదేహాన్ని బావిలో గాలించి గుర్తించారు. పిల్లలను బావిలో తోసి మీన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని నిర్ధారించారు. ఈమేరకు మురుగన్‌ను పోలీసులు ప్రశి్నస్తున్నారు. 

మరిన్ని వార్తలు