వైరల్‌: పిల్లలతో బాతు దాగుడుమూతలు, నెటిజన్ల నవ్వులు

30 Jun, 2021 16:21 IST|Sakshi

చిన్నపిల్లలు దాగుడుమూతలు ఆడటం మనం చూసుంటాం. కాకపోతే ఈ వీడియోను చూస్తే మాత్రం.. ఈ ఆట కేవలం మనుషులకు మాత్రమే కాదు, బాతులు కూడా ఆడుకుంటాయా? అనిపిస్తుంది. అలాంటి ఫన్నీ వీడియోను ఓ ట్విటర్‌ ఖాతాదారుడు షేర్‌ చేయగా నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. జంతువుల ఆటలు, సరదాగా చేసిన పనుల వీడియోలు ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ బాతు, తన పిల్లల వీడియో విషయానికి వస్తే.. 24 సెకన్ల నిడివ గల ఈ వీడియోలో..  నీటి కొల‌నులో ఉన్న‌ బాతు పిల్ల‌లు త‌న త‌ల్లి ద‌గ్గ‌రికి వెళ్తుంటాయ్‌. అవి అలా దగ్గరకు వెళ్లిన ప్రతీసారి తల్లి బాతు తన పిల్లలకు కనపడకుండా నీటిలో మునిగి దాక్కుంటోంది. ఇలా మూడు సార్లు తన పిల్లలతో ఆ తల్లి బాతు ఆటలాడుతుంది.

చూడటానికి అచ్చం మన పిల్లలు ఆడే హైడ్‌ అండ్‌ సీక్‌ లానే ఉన్న ఈ సరదా వీడిలో చాలా ఫన్నీగా ఉండడంతో సోషల్‌ మీడియా యూజర్లకు వీపరీతంగా నచ్చేసింది. భారీ సంఖ్యలో వ్యూస్‌, లైక్స్‌తో దూసుకుపోతోంది. త‌న పిల్ల‌ల‌కు నీటిలో ఎలా మున‌గాలో త‌ల్లి ట్రైనింగ్ ఇస్తుంద‌ని కొందరు, మ‌న‌షుల నుంచి ఎలా త‌ప్పించుకోవాలో తర్ఫీదునిస్తోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మాతృ దేవో భవ.. తల్లే తొలి గురువు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

చదవండి: మనుషుల కంటె ఏనుగులే నయం.. వైరల్‌ వీడియో..

మరిన్ని వార్తలు