4 గంటల పర్యటన.. రూ.23 కోట్లకు పైగా ఖర్చు

13 Nov, 2021 10:37 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ నవంబర్‌ 15 జనజాతీయ గౌరవ్ దివస్

ముఖ్య అతిథిగా హాజరవుతున్న నరేంద్ర మోదీ

మోదీ పర్యటన నిమిత్తం భారీ ఏర్పాట్లు

భోపాల్‌: గిరిజన యోధుల సంస్మరణార్థం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నవంబర్‌ 15న జనజాతీయ గౌరవ్ దివస్‌ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరువుతున్నారు. కార్యక్రమంలో భాగంగా మోదీ రాష్ట్ర రాజధానిలో సుమారు 4 గంటల పాటు ఉండనున్నారు.

ఈ క్రమంలో ప్రధాని 4 గంటల పర్యటన కోసం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 23 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నది. దీనిలో సుమారు 15 కోట్ల రూపాయలను రవాణా కోసమే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. జంబోరి మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమం కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి జనాలను తరలించనున్నారు. 
(చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..)

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం భగవాన్‌ బిర్సా ముండా జ్ఞాపకార్థం జన్‌జాతీయ గౌరవ్‌ దివాస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న మోదీ.. ఈ వేదిక మీదుగా దేశంలో తొలిసారి ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో నిర్మించిన హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. 

జంబోరి మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుదిక్కుల నుంచి సుమారు 2 లక్షల మంది గిరిజనులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యక్రమం జరగనున్న వేదిక మొత్తాన్ని గిరిజన యోధుల చిత్రాలతో అలంకరించనున్నారు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి 300 మంది కళాకారులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. 
(చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!)

కార్యక్రమం కోసం 52 జిల్లాల నుంచి వచ్చే ప్రజల రవాణా, ఆహారం, వసతి కోసం ప్రభుత్వం 12 కోట్ల రూపాయలకు కేటాయించింది. అతిథులు కూర్చునే వేదిక కోసం ప్రత్యేకంగా ఐదు గోపురాలు, గుడారాల నిర్మాణం, ఇతర అలంకరణ, ప్రచారానికి గాను 9 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం.

మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. 2008లో బీజేపీ వీటిలో 29 గెలిచింది. 2013లో ఆ సంఖ్య 31 పెరిగింది. అయితే 2018లో 47 స్థానాల్లో బీజేపీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భారీ ఎత్తున గిరిజనుల యోధుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

చదవండి: 
ప్రభుత్వాలకు మీరు మార్గదర్శకులు

సార్‌.. మా ఊరే లేదంటున్నారు

మరిన్ని వార్తలు