భార్య చివరి కోరిక.. 17 కేజీల బంగారాన్ని ఏం చేసాడంటే?

27 Oct, 2021 13:57 IST|Sakshi

ఉజ్జయినీ: మనకి ఇష్టమైన వాళ్ల కోరికలను తీర్చడానికి ఎన్నో చేస్తుంటాం. అదే కోరిక వాళ్లకి చివరిదైతే ఎలాగైనా తీర్చేందుకు సిద్ధపడుతాం. అలా ఓ వ్యక్తి తన భార్య చివరి కోరికను తీర్చడానికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 కేజీల బంగారన్ని అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని బొకారో నివాసి సంజీవ్ కుమార్, రష్మి ప్రభ భార్యాభర్తలు. 

దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్‌ దేవాలయానికి రష్మి ప్రభ నిత్యం వెళ్లి అమ్మవారిని దర్శించుకునేది. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవలే చనిపోయింది. చనిపోయే ముందు ఆమె అమ్మవారికి తన నగలను సమర్పించాలని అదే తన చివరి కోరికగా భర్త సంజవీ కుమార్‌కు తెలిపింది. దీంతో తన భార్య చివరి కోరికను తీర్చేందుక ఆ వ్యక్తి తన భార్య ఆభరణాలు, 310 గ్రాముల బరువున్న నెక్లెస్‌లు, గాజులు, చెవిపోగులు సహా సుమారు రూ. 17 లక్షల విలువైన ఆభరణాలను అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు మీడియాకు వెల్లడించారు.

చదవండి: Viral Video: భీకర గంగా ప్రవాహం.. క్షణ క్షణం ఉత్కంఠ.. ప్రమాదం అంచున తల్లీ బిడ్డలు.. వారు సేఫ్‌, అయితే..

మరిన్ని వార్తలు