సెల్ఫీ కావాలంటే రూ.100 కట్టాలంటున్న మంత్రి

19 Jul, 2021 07:46 IST|Sakshi

భోపాల్‌: తనతో ఎవరైనా సెల్ఫీ తీసుకోవాలంటే ర. 100 కట్టాల్సిందిగా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక  శాఖ మంత్రి ఉషా ఠాకర్‌ చెప్పారు. ఆయా సొమ్మును పార్టీ పనుల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. శనివారం ఆమె ఖాండ్వా వద్ద మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా సమయం వృథా అవుతోందని, కొన్ని కార్యక్రమాలకు గంటల కొద్దీ ఆలస్యమవుతోందన్నారు. బీజేపీ స్థానిక మండల్‌ యూనిట్‌లో రూ. 100 కట్టడం ద్వారా తనతో సెల్ఫీ తీసుకోవచ్చన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు