ఒకే వ్యక్తికి రెండు ఫంగస్‌లు..షాక్‌లో వైద్యులు

23 May, 2021 21:53 IST|Sakshi

భోపాల్‌: గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ రూపంలో ప్రత్యేకంగా భారత్‌ను అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్‌ ఇంకా వదలక ముందే.. బ్లాక్ ఫంగస్‌ అంటూ మరో మహమ్మారి గురించి చెప్పి శాస్త్రవేత్తలు బాంబు పెల్చారు. అలా చెప్పిన కొన్నిరోజల్లోనే ఒకే వ్యక్తికి బ్లాక్‌తో పాటు వైట్ ఫంగస్ ఉన్న కేసు ఒకటి వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ఈ అరుదైన ఘటన తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది.

రెండు ఫంగస్‌లు
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాజాగా ఒకే వ్యక్తికి రెండు ఫంగస్‌లు సోకడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఒక వ్యక్తిలో ఒక ఫంగస్‌ని గుర్తించిన వైద్యులు ఆశ్చర్యంగా ఒకే వ్యక్తిలో రెండు రకాల ఫంగస్‌ను గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ తోపాటు వైట్ ఫంగస్ ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. దేశంలో ఈ తరహా కేసు ఇదే మొదటి సారి కావడం గమనార్హం.దీంతో వైద్యులు షాక్‌కు గురవుతున్నారు.

అయితే.. ఆ తర్వాత భోపాల్‌లో కూడా ఇలాంటి కేసు ఒకటి నమోదైందని తెలుస్తోంది. ఈ ఫంగస్‌ అడ్డకట్టకు ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారిలో స్టెరాయిడ్స్ వాడిన వారిని గుర్తించే పనిలో ఉన్నాయి. బ్లాక్ ఆండ్ వైట్ ఫంగస్ లు ముప్పు ఎక్కువగా కరోనా నుంచి కోలుకునే క్రమంలో అధికంగా స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో వెలుగు చూస్తున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అధికంగా స్టెరాయిడ్స్ వినియోగం వల్ల ఇమ్యూనిటీ పవర్ దెబ్బ తింటోందని దాంతోనే ఈ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 

చదవండి: కరోనా బాధితులకు గ్యాంగ్రీన్‌ ముప్పు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు