ఆకట్టుకుంటున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాస్క్‌ డిజైన్‌ 

9 Mar, 2021 11:24 IST|Sakshi

ప్రత్యేక మాస్కు ధరించి పార్లమెంటుకు వచ్చిన ఎంపీ నరేంద్ర జాదవ్‌  

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు వాడుతుంటాం. అయితే చాలా మంది విభిన్నమైన మాస్కులు ధరిస్తుంటారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలు కూడా మాస్కులు ధరించి వచ్చారు. అయితే మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి రూపొందించిన ప్రత్యేకమైన మాస్కు గురించి సోమవారం సభలో చర్చనీయాంశమైంది. సోమవారం రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు నరేంద్ర జాదవ్‌ వినూత్నమైన మాస్క్‌ ధరించి సభకు వచ్చారు. అందరి దృష్టి ఆయన మాస్కుపైనే పడింది.

మాస్కు గురించి అందరూ ఆరా తీశారు. దీంతో తన మిత్రుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు ఈ మాస్కును బహుమతిగా ఇచ్చారని నరేంద్ర జాదవ్‌ తెలిపారు. 99.97% సామర్థ్యం కలిగిన హై ఎఫీషియెన్సీ పార్టిక్యులేట్‌ ఎయిర్‌ (హెపా) మాస్క్‌ను సానుకూల పీడనం ఆధారంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూపొందించారు. కరోనా సమయంలో మాస్కులతో పాటు, ఇంట్లోనే శానిటైజర్‌ తయారు చేసుకోవడం, కరోనా పేషంట్లకు ప్రత్యేక వెంటిలేటర్‌ ప్రిసెషన్‌ ఎయిర్‌ పంప్‌ (పీఏపీ)ను ఇంజనీర్‌ అయిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తయారు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు