యాప్‌తో ఎంపీల అటెండెన్స్‌

11 Sep, 2020 08:11 IST|Sakshi

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు నిలిచిపోతాయని, సాధ్యమైనంత వరకు సభల్లోని అన్ని కార్యకలాపాలను డిజిటలైజ్‌ చేస్తున్నామని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తెలిపారు. ఈ దఫా తొలిసారి లోక్‌సభ ఎంపీలు తమ అటెండెన్స్‌ను మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఇలా డిజిటల్‌ అటెండెన్స్‌ను చేపట్టారు. ఎన్‌ఐసీ రూపొందించిన ఈ అటెండెన్స్‌ రిజిస్టర్‌ యాప్‌తో ఎంపీలు భౌతికంగా హాజరు పుస్తకాలను తాకాల్సిన పనిఉండదు. ఈ యాప్‌ కేవలం పార్లమెంట్‌ పరిధిలోనే పనిచేస్తుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా