మరోసారి పెద్దమనసు చాటిన ముఖేష్‌ అంబానీ..!

15 Apr, 2021 23:37 IST|Sakshi

ముంబై: భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో కోవిడ్‌ పేషెంట్లకు ఆక్సిజన్‌ దొరకని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్‌ కొరత వల్ల కరోనా రోగులు మరణిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కరోనా పేషెంట్ల కోసం తన వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చాడు.

రిలయన్స్ నుంచి రాష్ట్రానికి 100 టన్నుల ఆక్సిజన్‌ గ్యాస్ నిల్వలను అందించనున‍్నట్లు మహారాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే ట్విటర్‌లో పేర్కొన్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి మహారాష్ట్రకు ఎటువంటి ఖర్చు లేకుండా ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ తన పెట్రోలియం కోక్ గ్యాసిఫికేషన్ యూనిట్ల కోసం వాడే కొన్ని ఆక్సిజన్ నిల్వలను కరోనా రోగుల కోసం వినియోగించనున్నారు.

చదవండి: ముంబై: మళ్లీ తెరపైకి రైల్వేకోచ్‌లు 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు