కేంద్రం ఆఫర్‌కు నో చెప్పిన ముకుల్‌ రొహత్గీ

26 Sep, 2022 07:53 IST|Sakshi

న్యూఢిల్లీ: అటార్నీ జనరల్‌ పదవిని సీనియర్‌ అడ్వొకేట్‌ ముకుల్‌ రొహత్గీ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం చెప్పారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌(91) పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుండటంతో ఆ పదవికి రొహత్గీని కేంద్రం ఎంపిక చేయడం తెలిసిందే. వేణు గోపాల్‌ కూడా ఆరోగ్యో కరాణాలతో ఈ పదవిలో మరింతకాలం కొనసాగనని ఇప్పటికే చెప్పారు.

ముకల్ రొహత్గీ కేంద్రం ఆఫర్‌ను తిరస్కరించాడని ప్రత్యేక కారణాలేమీ లేవని చెప్పారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రొహత్గీ 2014 నుంచి 2017వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఒకవేళ కేంద్రం ఆఫర్‌కు ఆయన ఓకే చెప్పి ఉంటే ఈ పదవిని రెండోసారి చేపట్టేవారు.
చదవండి: సోనియాతో నితీశ్, లాలూ కీలక భేటీ..

మరిన్ని వార్తలు