మళ్లీ తెరపైకి ‘ముల్లై పెరియార్‌’

3 Nov, 2021 07:45 IST|Sakshi

డ్యాంపై కేరళ మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు 

పోరుబాటకు సిద్ధమైన అన్నాడీఎంకే

సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్‌ డ్యాం వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. ఈ డ్యాంపై కేరళ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడులోని ఐదు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్‌ జలాశయంపై తమిళనాడుకు మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి. న్యాయ పోరాటంతో ఈ జలాశయంలో 142 అడుగుల మేరకు నీళ్లు నిల్వ ఉంచే అవకాశం దక్కింది.152 అడుగులకు పెంచుకునే వెసులు బాటు సైతం ఉంది. కేరళలో వరద ప్రళయాలకు ఈ డ్యాం కారణం అన్నట్టుగా అక్కడి మంత్రులు పరోక్ష వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీశాయి. పదే పదే డ్యాం పరిసరాలను తనిఖీ చేయడం వివాదానికి ఆజ్యం పోస్తోంది. ప్రత్యామ్నాయ జలాశయానికి ఆది నుంచి కేరళ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వివాదం మళ్లీ రాజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

 చదవండి: (సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్‌)

పోరుబాటకు అన్నాడీఎంకే రెడీ 
ఈ డ్యాంపై తమిళనాడులోని తేని, విరుదునగర్, రామనాథపురం, మదురై, శివగంగై జిల్లాలు తాగు, సాగు నీటికి కోసం ఆధార పడి ఉన్నాయి. తాజాగా కేరళ చర్యలతో ఇక్కడ ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరుసెల్వం, పళని స్వామి ఐదు జిల్లాల్లో పోరుబాట సాగించేందుకు సిద్ధమయ్యారు. తొలి విడతగా ఈనెల 9న నిరసన కార్యక్రమాలకు నిర్ణయించారు. కేరళ చర్యలను చోద్యం చూడకుండా, కట్టడి లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  152 అడుగులకు నీటి మట్టం పెంపు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని కోరారు.     

 చదవండి: (వివాదంలో సీమాన్‌.. 300 మంది పార్టీ నాయకులపై కేసులు)

మరిన్ని వార్తలు