అగ్నిప్రమాదాలకు నిలయంగా ముంబై? 

24 Oct, 2021 15:13 IST|Sakshi

2008–2018 మధ్య 48 వేలకుపైగా అగ్ని ప్రమాదాలు 

వీటిలో అధికశాతం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే 

2020లో మరో 3,841 అగ్నిప్రమాదాలు 

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం అగ్నిప్రమాదాలకు నిలయంగా మారినట్లు తెలుస్తోంది. గత పన్నేండేళ్లలో నగరంలో 50 వేలకుపైగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. లాల్‌బాగ్‌ ప్రాంతంలో ని వన్‌ అవిఘ్న పార్క్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగి ఒకరు చనిపోయిన సంగ తి తెలిసిందే. దీంతో 2008–2018 మధ్య కాలంలో ముంబై నగరంలో మొత్తం ఎన్ని అగ్ని ప్రమాద సంఘటనలు సంభవించాయో తెలపాలని షకీల్‌ అహ్మద్‌ షేక్‌ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)ని కోరారు. దీంతో బీఎంసీ ఈ వివరాలను వెల్లడించింది.

చదవండి: (ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..)

బీఎంసీ తెలిపిన వివరాల ప్రకారం ముంబై నగరంలో 2008–2018 మధ్య కాలంలో 48,434 అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ అగ్నిప్రమాదాల్లో 609 మంది చనిపోయారు. వీరిలో 29 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ అగ్నిప్రమాదాల్లో అత్యధికం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనే సంభవించాయని బీఎంసీ పేర్కొంది. మొత్తం అగ్ని ప్రమాదాల్లో 1,568 ప్రమాదాలు ఆకాశహరŠామ్యల భవనాలలో జరగగా.. 8,737 ప్రమాదాలు సామాన్య నివాస భవనాలలో సంభవించాయి.

3,833 ప్రమాదాలు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో చోటుచేసుకోగా.. 3,151 అగ్ని ప్రమాదాలు మురికివాడల్లో జరిగాయి. మొత్తం ప్రమాదాల్లో 32,516 ప్రమాదాలు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగడం వల్ల సంభవించాయి. 1,116 ప్రమాదాలు గ్యాస్‌ సిలిండర్లు పేలడం వల్ల జరగగా.. 11,889 ప్రమాదాలు సిలిండర్‌ లీకేజీ వల్ల చోటుచేసుకున్నా యి. మిగతా ప్రమాదాలు ఇతర కారణాల వల్ల జరిగినట్లు బీఎంసీ పేర్కొంది. వీటితోపాటు, నగరంలో 2020లో మరో 3,841 అగ్నిప్రమాదాలు సంభవించా యని బీఎంసీ తెలిపింది. 2020లో జరిగిన ప్రమాదాల్లో వంద మంది చనిపోగా, సుమారు రూ. 89 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బీఎంసీ వివరించింది.  

మరిన్ని వార్తలు