ఇంద్రాణి ముఖర్జీయా 'సహా 40 మంది ఖైదీలకు కోవిడ్‌

21 Apr, 2021 16:20 IST|Sakshi

బైకుల్లా జైల్లో కోవిడ్‌ కలకలం 

ముంబై: కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విస్తరిస్తోంది. చిన్న, పెద్ద, బీద, ధనిక తేడాలేం లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తోంది. తాజాగా జైల్లోకి కూడా ఎంటరయ్యింది మహమ్మారి. 38 మంది ఖైదీలు కోవిడ్‌ బారిన పడ్డారు. ఈ ఘటన కరోనాతో విలవిల్లాడుతున్న మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబై బైకుల్లా జైలులో 38 ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో షీనా బోరా హత్య కేసు నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జీయా కూడా ఉన్నారు. జైలు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాక నగరంలోని పరం శాతిధాం వృద్ధాశ్రమంలో 58 మందికి కోవిడ్‌ సోకినట్లు తెలిసింది.

ఇక మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 58,924 కోవిడ్‌ కేసులు నమోదవ్వగా.. 351 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు మూడు లక్షలకు చేరువవ్వగా.. 2,023 మంది మరణించారు. 

చదవండి: మీ కక్కుర్తి తగలడా.. ప్రాణం కన్న బీరే ముఖ్యమా?

మరిన్ని వార్తలు