48 గదులతో కూడిన తొలి పాడ్‌ వెయిటింగ్‌ రూమ్‌!

18 Nov, 2021 08:01 IST|Sakshi

న్యూఢిల్లీ: రైలు ఎక్కేందుకు ట్రాఫిక్‌ కారణంగా కాస్త ముందుగా వెళ్లాలనుకునే ప్రయాణికులు అక్కడ స్టేషన్‌లో విశ్రాంతి రూం  సరిగా ఉండక ఎక్కడ బస చేయాలో తోచక ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం ముంబై రైల్వే శాఖ సరికొత్త పాడ్‌ రూంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా మంది హోటల్‌కి వెళ్లి రూం అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి వారి కోసం ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లోని మొదటి అంతస్తులో 48 గదులతో కూడిన తొలి పాడ్‌ వెయిటింగ్‌ రూంను అందుబాటులోకి తీసుకువచ్చింది.

(చదవండి: అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ)

అయితే వీటిలో క్లాసిక్ పాడ్‌లు, ప్రైవేట్ పాడ్‌లు "లేడీస్-ఓన్లీ" పాడ్‌లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పాడ్‌లు వంటి గదులు ఉన్నాయి. దీన్ని క్యాప్సూల్ హోటల్‌గా పిలిచే ఈ పాడ్ హోటల్‌లో ఒక్కో మంచంతో కూడిన చిన్న గదులు ఉంటాయి. ఈ మోడల్ జపాన్‌లో ఉద్భవించింది. ఇది కేవలం రాత్రి బస చేయడానికి లేదా చిన్న వ్యాపార పర్యటనలో అలసటతో నిద్రపోవడానికి బయట హోటల్‌కి వెళ్లడానికి విముఖత చూపే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ  కాంపాక్ట్ వసతి పరిష్కారాన్ని అందించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూలో "స్నీక్ పీక్" అనే పేరుతో ఈ అత్యధునిక సరికొత్త విశ్రాంతి పాడ్‌ రూంలకు స్వాగతం అంటూ  వాటికి సంబంధించిన వీడియోను ఒకటి సోషల్‌ మాధ్యమంలో పోస్ట్‌ చేశారు.

(చదవండి:  బాప్‌రే! ఈ పేయింటింగ్‌ ధర రూ. 260 కోట్లా!!)

మరిన్ని వార్తలు