మాస్‌ స్టెప్పులతో ఇరగదీసిన ముంబై పోలీస్‌.. నెటిజన్లు ఫిదా

8 Aug, 2021 13:34 IST|Sakshi

Mumbai cop dance Video: పోలీస్‌.. ఈ పేరు వినగానే తెలియకుండానే ఎంతో మంది ఒంట్లోకి ముందుగా భయం పుట్టుకస్తుంది. పేరుకు తగ్గట్లే పోలీసులు కూడా నిత్యం హత్యలు, దొంగతనాలు, అరెస్టులు, కేసులు, విచారణలు.. వీటితోనే బిజీగా ఉంటుంటారు. అయితే కొంతమంది పోలీసులు మాత్రం ఎంతో సరదాగా, చిలిపితనంతో ఉంటారు. అలాంటి కోవలోనే మహారాష్టకు చెందిన పోలీస్‌ అధికారి తనకున్న ఓ టాలెంట్‌తో తాజాగా వార్తలెకెక్కాడు. ముంబైలోని అమోల్ యశ్వంత్ కాంబ్లే అనే 38 ఏళ్ల పోలీస్‌ అధికారికి చెందిన డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. పోలీస్‌ అయినప్పటికీ పర్‌ఫెక్ట్‌ డ్యాన్స్‌ స్టెప్పులతో అందరిని మంత్రముగ్ధుల్ని చేశాడు.

అమోల్‌ యశ్వంత్‌ కాంబ్లేకు నైగావ్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగంతోపాటు కాంబ్లేకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే విధులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా తరుచూ డ్యాన్స్‌ చేయడం ఇతనికి అలవాటు. ఇలా తన డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు. ‘అప్పు రాజా’ సినిమాలోని ఆయా హై రాజా పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కిల్లర్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరలవ్వడంతో వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చి చేరుతున్నాయి.

అయితే వీడియో చేయడం వెనుక సామాజిక కోణం కూడా ఉందని కాంబ్లే తెలిపారు. డ్యూటీలో ఉన్న ఉన్న పోలీసు ఉద్యోగి.. మాస్క్ ధరించని టూ వీలర్ వ్యక్తికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్‌తో ఈ డ్యాన్ చేశామని,  ఉద్ధేశ్యంతోనే ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశామని వెల్లడించారు. కాగా మాహిమ్‌ ప్రాంతంలో నివాసముంటున్న కాంబ్లే 2004 లో పోలీస్‌ శాఖలో చేరాడు. అయితే ఇతనికి చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై అమితమైన పిచ్చి. ఎన్నో స్టేజులమీద ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. తన డ్యాన్‌ అభిరుచిపై కాంబ్లే స్పందిస్తూ..‘ మా అన్నయ్య కొరియోగ్రాఫర్‌.. పోలీస్‌ ఉద్యోగంలో చేరేముందు తనతో కలిసి కొన్ని డ్యాన్స్‌ షోలు చేశాను. ఇప్పుడు కూడా వీక్లీ ఆఫ్‌లు, ఖాళీ సమయాల్లో డ్యాన్స్‌ చేస్తుంటాను.’ అని తెలిపాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు