'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కీలక తీర్పు ఇచ్చిన కోర్టు..

29 Dec, 2022 12:54 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త స్వలింగ సంపర్కుడని, ఈ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పెళ్లయిన తర్వాత ఆయనకు దగ్గరయ్యేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయిందని, ఆయనకు పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అంతేగాక తనను శారీరకంగా వేధిస్తున్నాడని, దుర్భాషలాడుతూ తన ఆర్థిక పరిస్థితి, కుటుంబాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది.

అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గే అని దాచినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. 

ఈ తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు భర్త. ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఆమెకు రూ.లక్ష, ప్రతి నెల రూ.15 చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఈ దంపతులకు 2016లో వివాహం జరిగింది. పెళ్లై రోజులు గడుసున్నా ఆమెను అతడు దగ్గరకు రానివ్వలేదు. హింసించడం మొదలుపెట్టాడు. అనుమానంతో అతడ్ని గమనించిన భార్య.. చివరకు గే ‍అని కనిపెట్టింది. ఇతర పురుషులతో అతడు నగ్నంగా దిగిన ఫొటోలోను అతని ఫోన్‌లో చూసింది. వాటినే కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది.
చదవండి: డబ్బు విషయంలో భర్తతో గొడవ.. 8 ఏళ్ల కుమారుడ్ని కాలువలోకి విసిరి..

మరిన్ని వార్తలు