సుశాంత్‌ సింగ్‌ కేసుకు సంబంధించి ముంబై డీసీపీ ఫిర్యాదు

3 Feb, 2021 19:33 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి రిపబ్లిక్‌ మీడియా అధినేత అర్నాబ్‌ గోస్వామి, అతని భార్య సమ్యబ్రతా రే గోస్వామిలపై ముంబై జోన్‌-9  డీసీపీ అభిషేక్‌ త్రిముఖే పరువు నష్టం దావా వేశారు. తనపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గోస్వామిలపై క్రిమినల్‌ పరువు నష్టం దావా దాఖలు చేశానని డీసీపీ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా దాఖలు చేశానని ఆయన తెలిపారు. కాగా, గతేడాది జూన్‌ 14న బాంద్రాలోని ఫ్లాట్‌లో సుశాంత్‌ అనుమాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు