మీ గణేష్‌ ఉత్సవాలతోనే రోడ్డుపై గుంతలు.. రూ.3.66లక్షలు కట్టండి!

21 Sep, 2022 12:22 IST|Sakshi

ముంబై: ఈ నెల తొలివారంలో దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు పదోరోజు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉత్సవాలు ముగిసిన వారం తర్వాత ముంబై నగర పాలక సంస్థ చేసిన పని ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. ముంబైలోని ప్రముఖ లాల్‌బాగ్‌చా రాజా గణేష్‌ ఉత్సవాల నిర్వహణ కమిటీకి భారీ జరిమానా విధించింది. మీ గణేష్‌ ఉత్సవాల కారణంగా రహదారిపై 183 గుంతలు పడి రోడ్డంతా పాడైపోయిందని నోటీసులు ఇచ్చింది. ఒక్కో గుంతకు రూ.2,000 చొప్పున మొత్తం రూ.3.66 లక్షలు చెల్లించాలని ఆదేశించింది బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ). 

గణేష్‌ ఉత్సవాలు ముగిసిన తర్వాత నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. లాల్‌బాగ్‌చా రాజా గణేష్‌ ఉత్సవ కమిటీకి పంపించిన లేఖలో.. డాక్టర్‌ బాబాసాహేబ్‌ రోడ్‌ నుంచి టీబీ కడమ్‌ మార్గ్‌ వరకు రోడ్డు మొత్తం పాడైపోయిందని తెలిపింది బీఎంసీ ఈవార్డ్‌ కార్యాలయం.

ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్‌ అస్త్రం!

మరిన్ని వార్తలు