ప్రపంచ టెస్టీ శాండ్‌విచ్‌లలో భారతీయ వంటకానికి చోటు.. ఏదో తెలుసా!

6 Mar, 2023 17:06 IST|Sakshi

ఇరవై ఏళ్ల కిందట స్ట్రీట్‌ ఫుడ్‌లపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అప్పట్లో బయట తినాలంటే రెస్టారెంట్‌, హోటల్స్‌వైపే మొగ్గు చూపేవాళ్లు. అయితే మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుత రోజుల్లో నగరవాసులు ఉరుకుల పరుగుల మధ్య బిజీబిజీగా గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో స్ట్రీట్‌ ఫుడ్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. తాజాగా భారత స్ట్రీట్‌ ఫుడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌
దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక చిరుతిండి ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా, మహారాష్ట్రలోని ప్రసిద్ధ స్నాక్స్‌లో ఒకటైన వడ పావ్ ఇప్పుడు టేస్ట్ అట్లాస్ ద్వారా ప్రపంచంలోని 13వ అత్యుత్తమ శాండ్‌విచ్‌గా ర్యాంక్ పొందింది. ఈ ర్యాంకింగ్‌ను టేస్ట్ అట్లాస్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా షేర్ చేసింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 50 వంటకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. అందులో మొదటిది టోంబిక్ అయితే, జాబితాలో చివరిది టోర్టా అహోగడాగా. ఇందులో భారతీయ స్ట్రీడ్‌ పుడ్‌ అయిన వడా పావ్‌ 13 స్థానంలో నిలవగా, ఈ వంటకానికి 4.4 రేటింగ్‌ లభించింది.

ఇంతలో, భారతీయ ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ వడ పావ్ గురించి వివరిస్తూ, టేస్ట్ అట్లాస్ తన వెబ్‌సైట్‌లో ఇలా రాసుకొచ్చింది. "ఈ ప్రసిద్ధ చిరుతిండిని 1960 నుంచి 1970 లలో దాదర్ రైలు స్టేషన్‌కు సమీపంలో పనిచేసిన స్ట్రీట్‌ వెండర్‌ (వీధి వ్యాపారి) అశోక్ వైద్య కనుగొన్నట్లు సమాచారం. అతను ఆకలితో ఉన్న సిబ్బందికి ఆహారం అందించేందుకు ఈ వంటకాన్ని కనుగొన్నాడు. ముందుగా అశోక్‌ తన వంటకంలో ఏం ఉండాలో నిర్ణయుంచుకుని.. అందులో తక్కువ ధర, రుచి, సులభంగా రవాణా చేయడం వంటివి పరిగణలోకి తీసుకుని ఈ వడ పావ్‌ను కనుగొన్నట్లు పేర్కొంది.

చట్నీతో తింటే సూపర్‌
కాలక్రమేణా వడపావ్‌కు ప్రజాదరణ కూడా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వడపావ్‌కు వచ్చిన రేటింగ్‌పై చాలా మంది నెటిజన్లు సంతోషంగా లేరు. ఈ చిరుతిండిని నంబర్ వన్‌గా లిస్ట్ చేసి ఉండాలని అభిప్రాయపడుతున్నారు. వడ పావ్ అంటే ప్రాణం అని ఒక యూజర్‌ కామెంట్‌ చేయగా, చట్నీతో కూడిన మరొక వడ పావ్ కాంబినేషన్‌ టేస్ట్‌ సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు