వరవరరావుకు ఆసుపత్రిలో చికిత్స

18 Nov, 2020 13:44 IST|Sakshi

ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు(80)కు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ముంబై హైకోర్టు బుధవారం అనుమతించింది. దీంతో 15 రోజులపాటు నానావతి ఆస్పత్రిలో వరవరరావుకు చికిత్స అందించనున్నారు. ఆస్పత్రి నిబంధనల ప్రకారం వరవరరావును కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఉంది. కాగా ఎల్గార్‌ పరిషత్‌ కేసులో జైలులోఉన్న తెలుగు కవి వరవరరావు ఆరోగ్యంపై బొంబాయి హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వివరణ ఇచ్చింది.

వరవరరావు ఆరోగ్యం బావుందని, మానసికంగా కూడా పూర్తి స్పృహలో ఉన్నారని వివరించింది. అయితే, వరవరరావుకు న్యూరలాజికల్‌ సమస్య, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌లకు సంబంధించిన సమస్యులున్నాయని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్‌ తెలిపారు. దీంతో, అన్ని వైద్య పరీక్షలను నిర్వహించి, సమగ్ర వైద్య నివేదికను అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరవరరావు ప్రస్తుతం తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. చదవండి: వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ

మరిన్ని వార్తలు