నేడు హార్బర్‌లో మెగాబ్లాక్‌,లోకల్‌ ట్రైన్స్‌ రద్దు

27 Jun, 2021 12:21 IST|Sakshi

సాక్షి ముంబై: సెంట్రల్, హార్బర్‌ రైల్వే మార్గాలపై ఆదివారం మెగాబ్లాక్‌ నిర్వహించనున్నారు. దీని ప్రభావం లోకల్‌ రైళ్లతోపాటు మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలపై కూడా పడనుంది. దీంతో పలు లోకల్‌ రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించి నడుపనున్నారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అత్యవసర సేవలందించే వారికోసం నడుపుతున్న లోకల్‌ సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడనుంది.  

సెంట్రల్‌ రైల్వే మార్గంపై..                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            
సెంట్రల్‌ రైల్వే మార్గంలోని మాటుంగా – ములూండ్‌ రైల్వే స్టేషన్ల మధ్య అప్, డౌన్‌ ఫాస్ట్‌ ట్రాక్‌పై ఉదయం 11.05 గంటల నుంచి సాయంత్రం 4.05 గంటల వరకు మెగాబ్లాక్‌ నిర్వహించనున్నారు. దీంతో అప్, డౌన్‌ ఫాస్ట్‌  ట్రాక్‌పై నడిచే లోకల్‌ రైళ్లను మాటుంగా – ములూండ్‌  రైల్వేసైఏ్టషన్ల  మధ్య డౌన్‌ స్లో ట్రాక్‌పైకి మళ్లించనున్నారు. దీంతో ఈ రైళ్లన్ని మాటుంగా–ములూంలడ్‌ రైల్వే స్టేషన్ల మధ్య అన్ని రైల్వేస్టేషన్లలో నిలువనున్నాయి. అయితే అప్‌ ఫాస్ట్‌ రైళ్లు మాటుంగా తర్వాత, డౌన్‌ ఫాస్ట్‌ రైళ్లు ములూండ్‌ తర్వాత మళ్లీ ఫాస్ట్‌ ట్రాక్‌లపైకి మళ్లించనున్నారు.  దీంతో రెళ్లన్ని సుమారు 15 నిమిషాలు ఆలస్యంగా నడవనున్నాయి.    

హార్బర్‌లో.. 

హార్బర్‌ మార్గంలో మాన్‌ఖుర్డ్‌ – నేరుల్‌ల మధ్య అప్‌డౌన్‌ మార్గంలో ఉదయం 11.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు మెగాబ్లాక్‌  నిర్వహించనున్నారు. దీంతో మెగాబ్లాక్‌ సమయంలో  సీఎస్‌ఎంటీ–పన్వెల్‌/బేలాపూర్‌/వాషీల మధ్య అప్‌డౌన్‌ మార్గాల్లో నడిచే లోకల్‌ రైళ్లను రద్దు చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని ప్రత్యేక లోకల్‌ రైళ్లను పన్వేల్‌–కుర్లా, కుర్లా–సీఎస్‌ఎంటీల మధ్య నడపనున్నారు. ప్రయాణికుల ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్‌ (సీఎస్‌ఎంటీ) – మాన్‌ఖుర్డ్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. అదేవిధంగా సెంట్రల్‌ మార్గంలోని మెయిన్‌ మార్గంలో వెళ్లే ప్రయాణికులు థనే–పన్వేల్‌ ట్రాన్స్‌హార్బర్‌ మార్గంలో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సెంట్రల్‌ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు