గుడ్‌బై చెప్పిన ‘ముంబై మిర్రర్‌’

19 Dec, 2020 16:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎంతో పాఠకాదరణ పొందిన టాబ్లాయిడ్‌ దిన పత్రికలు ‘ముంబై మిర్రర్‌’, ‘పుణే మిర్రర్‌’ డిసెంబర్‌ 5వ తేదీ, శనివారం నాటి సంచికతో సెలవు తీసుకున్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినడంతో వీటిని మూసివేయక తప్పలేదని వీటిని ప్రచరిస్తున్న ‘టైమ్స్‌ గ్రూప్‌’ ప్రకటించింది. ఇక నుంచి ముంబై మిర్రర్‌ను వార పత్రికగా మారుస్తామని, ఆన్‌లైన్‌ పత్రిక ఎప్పటిలాగా కొనసాగుతుందని టైమ్స్‌ గ్రూప్‌ తెలిపింది. (పార్టీ ఓ పెద్ద కుటుంబం: సోనియా గాంధీ)

కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఏడాది కాలంలోనే ముంబై నగరంలో మూడు ఆంగ్ల పత్రికలు మూత పడ్డాయి. ‘ది ఆఫ్టర్‌నూన్‌ డిస్పాచ్‌ అండ్‌ కొరియర్‌’ 2019, జూలై నెలలో మూతపడగా, డీఎన్‌ఏ పత్రిక 2019, అక్టోబర్‌ నెలలో మూత పడింది. ఈ పత్రికల మూతతో ఎన్నో మంది పాత్రికేయులు రోడ్డున పడగా, ముంబై మిర్రర్‌ మూతతో 1.6 కోట్ల మంది పాఠకులు నష్టపోతున్నారు. (పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్‌ నేత)

‘స్థానిక పౌర సమస్యలను ఎప్పటికప్పుడు పాఠకులతొ పాటు పాలకుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఆ సమస్యలకు ఎవరు బాధ్యులో, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో, ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు చేసే ప్రజల పత్రిక మూత పడడం బాధాకరమే’ అని ముంబై మిర్రర్‌ మూసివేతపై ‘ప్రాజెక్ట్‌ ముంబై’ ఎన్జీవో వ్యవస్థాపకులు శిశిర్‌ జ్యోషి వ్యాఖ్యానించారు. ప్రధాన జాతీయ ఆంగ్ల పత్రికలు ఆర్థిక భారం వల్ల తమ సిటీ ఎడిషన్‌ పేజీలను బాగా తగ్గించగా, మిర్రర్, ఆఫ్టర్‌నూన్, డీఎన్‌ఏ పత్రికల మూతతో జర్నలిస్టు మిత్రులకే కాకుండా ప్రజలకు కూడా నష్టం వాటిల్లిందని ప్రముఖ జర్నలిస్ట్‌ కల్పనా శర్మ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు