కోవిడ్-19 ఎఫెక్ట్ మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు

14 Apr, 2021 19:46 IST|Sakshi

ముంబై: కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. ముంబయి మహానగరంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పనులు చేస్తున్న వాళ్లు సొంతూళ్లు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దింతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. లోక్‌మన్య తిలక్ టెర్మినస్ వెలుపల చాలా మంది రైళ్లలో ఎక్కడానికి గుమిగూడారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు అక్కడకు చేరుకోవడంతో రైల్వే పోలీసులు,  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లోక్‌మన్య తిలక్ టెర్మినస్(ఎల్టిటి) వెలుపల అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది.  

అత్యవసర సేవలు మినయించి బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉంటాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి వీల్లేదని అధికారులు తెలుపుతున్నారు. దుకాణాలను, బహిరంగ ప్రదేశాలను మూసివేయనున్నారు. అయితే ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రాలు వంటి అత్యవసర సేవలపై ఎలాంటి నిబంధనలు విధించలేదు.

చదవండి: 

గుడ్‌న్యూస్‌: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు

>
మరిన్ని వార్తలు