మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్‌: ముంబై

15 Sep, 2021 10:52 IST|Sakshi

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సాకినాకలో మహిళపై పాశవికంగా హత్యాచారం చేసిన సంగతి తెసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబై పోలీసులు నగరంలో మహిళల రక్షణ కోసం నిర్భయ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్క్వాడ్‌ టీంలో ఒక మహిళా ఆఫీసర్‌, పీఎస్‌ఐ లేదా ఏఎస్‌ఐ ఉంటారని తెలిపారు.(చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి )

ఈ క్రమంలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఒక మహిళా భద్రతా సెల్‌(విమెన్‌ సేఫ్టీ సెల్‌) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత సమీక్షించటం కోసం ప్రతినెల మొదటివారం నిర్భయ స్క్వాడ్‌ సమావేశాన్ని సంబంధిత ప్రాంతీయ అదనపు డివిజనల్‌ కమిషనర్‌ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. మహిళలపై నేరాలు ఎక్కువుగా జరిగే ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు మరింత ముమ్మరం చేస్తామని ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలే తెలిపారు. 

(చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్‌.. తట్టుకోలేక)

మరిన్ని వార్తలు