డ్రగ్స్‌ ఆరోపణలపై దర్యాప్తునకు మహారాష్ట్ర ఆదేశం

11 Sep, 2020 15:54 IST|Sakshi

ముంబై పోలీసులకు లేఖ

ముంబై : బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. కంగనాపై వచ్చిన డ్రగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ముంబై పోలీసులను మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. నిషేధించిన పదార్థాలు, నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ను ఆమె వాడతారనే ఆరోపణల నిగ్గు తేల్చాలని ముంబై పోలీసులను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. చదవండి : కంగన వెనుక ఎవరున్నారు?

కంగనా కొకైన్‌ వాడతారని, తనను కూడా డ్రగ్‌ను తీసుకోమని ఆమె కోరారని 2016లో రికార్డైన నటుడు అధ్యయన్‌ సుమన్‌ ఇంటర్వ్యూ నేపథ్యంలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇక ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని ప్రభుత్వం కోరడంతో ముంబై పోలీసులు ఈ దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ చేపట్టాలా, యాంటో నార్కోటిక్స్‌ విభాగానికి దర్యాప్తు బాధ్యత అప్పగించాలా అనేది ముంబై పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ అంశంపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే అథ్యాయన్‌ సుమన్‌తో పాటు కంగనా రనౌత్‌లకూ సమన్లు జారీ చేస్తారు.

మరిన్ని వార్తలు