చిన్నారిని కాపాడిన రియల్ హీరోకు బహుమతి

20 Apr, 2021 14:11 IST|Sakshi

ముంబై: తన ప్రాణాలను సైతం చేయకుండా చిన్నారిని కాపాడిన రియల్ హీరో మయూర్ షెల్కేను అతని తోటి సిబ్బంది, నెటిజన్లే గాక ప్రముఖుల కూడా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిని సెంట్రల్‌ రైల్వే అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యాలయంలో షెల్కేకు ఇరు వైపుల అధికారులు, తోటి సిబ్బంది నిలబడి చప్పట్లతో అతనికి గ్రాండ్‌ వెల్‌కం పలికారు. అనంతరం షెల్కే ధైర్య సాహసాన్ని అభినందిస్తూ 50 వేల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముంబై డివిజనల్ మేనేజర్‌, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఇదంతా చిత్రీకరించిన వీడియోను రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ లో పంచుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, కోలీవుడ్‌ నటుడు మాధవన్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఆ ఉద్యోగి చేసిన సాహసాన్ని అభినందిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

మయూర్ షెల్కే ధైర్యం ఓ ప్రాణాన్ని కాపాడింది
వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద తల్లితో కలిసి నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా  రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారి తల్లి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేసింది. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలాడు. 

రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి ఫ్లాట్‌ ఫారం మీదకు తరలించాడు అంతే వేగంగా తను కూడా పట్టాల పైనుంచి తప్పుకున్నాడు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. షెల్కే సాహసంతో క్షణాల్లో ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో  రికార్డయ్యాయి. ఈ సాహస వీడియోను  రైల్వే శాఖ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

( చదవండి: పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో

మరిన్ని వార్తలు