పట్టాలు తప్పిన మంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు

23 Jul, 2021 18:21 IST|Sakshi
పట్టాలు తప్పిన మంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు

ముంబై: గోవాలోని ప్రఖ్యాత దూద్​సాగర్ జలపాతం వద్ద మంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడంతో దుష్సాగర్-సోనౌలిమ్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్, ఒక జనరల్ బోగీ పట్టాలు తప్పాయి. అయితే  ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జజరగలేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో ఉన్న మెత్తం 345 మంది ప్రయాణికులను హజరత్ నిజాముద్దీన్-వాస్కో డి గామా స్పెషల్ ట్రైన్‌లో మడ్గావ్ కు తరలించారు.

అదే సమయంలో దూద్​సాగర్-కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు-ముంబై రైలుని రూట్  మార్చి  తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు. హుబ్లి డివిజన్ రైల్వే మేనేజర్ అరవింద్ మల్ఖేడేతో పాటు సీనియర్ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు సాగుతున్న తీరును పరిశీలించారు.

మరిన్ని వార్తలు