పారా సెయిలింగ్‌ మళ్లీ ఫెయిల్‌ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!

22 Dec, 2021 20:24 IST|Sakshi

ఇటివల కాలంలో పారాసెయిలింగ్‌ చేయడానికి యువత తహతహాలాడుతున్నారు. పైగా ఆకాశంలో పక్షుల మాదిరి విహరిస్తుంటే ఆ అనుభవమే వేరు. అంతేకాదు యువత అడ్వెంచర్స్‌  చేయడానికే మొగ్గు చూపుతుంది. అందుకోసం ఎంత రిస్క్‌ అయిన చేస్తున్నారు. అయితే ఎందుకనో ఇటీవల కాలంలో అవి ఫెయిల్‌ అవుతున్నాయనే చెప్పాలి. ఈ మధ్య ఒక జంట పారాసెయిలింగ్‌ చేస్తుండగా తాడు తెగి కింద పడిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయ్యింది. అచ్చం అలానే ముంబైలోని ఇద్దరు మహిళలు సముద్రంపై పారాసెయిలింగ్‌ చేయాలని సన్నద్ధమయ్యారు. కానీ వారికి కూడా చేదు అనుభవం ఎదురైంది.

(చదవండి: ఢిల్లీలో 125కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. న్యూయర్‌, క్రిస్మస్‌ వేడుకలు బ్యాన్‌)

అసలు విషయంలో కెళ్లితే..ముంబైలోని సాకినాకాకు చెందిన ఇద్దరు మహిళలకు సముద్రం వద్ద  పారా సెయిలింగ్‌కు సిద్ధమయ్యారు. అయితే వారు పడవ మీద నుంచి పారాసెయిలింగ్‌ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక మోస్తారు ఎత్తుకు చేరుకున్నాక తాడు తెగిపోతుంది. దీంతో వాళ్లు ఒక్కసారిగా సముద్రంలో పడిపోతారు. అయితే అదృష్టవశాత్తు లైఫ్‌ జాకెట్లు ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు ఆ మహిళలు తాము తాడు కొంత భాగంలో నలిగి తెగిపోయే విధంగా ఉండటం గమినించాం అన్నారు.  పైగా రైడ్ నిర్వహిస్తున్న వ్యక్తులు తాడు దెబ్బతిన్న భాగం గాలిలోకి వెళ్లదని హామీ కూడా ఇచ్చారని అన్నారు. దీంతో పలువురు భారతదేశంలో సాహస క్రీడల భద్రతా ప్రమాణాల గురించి మరోసారి తీవ్రస్థాయితో విమర్శలు లెవనెత్తారు.

(చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?)

మరిన్ని వార్తలు