ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం

8 Aug, 2020 13:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేరళ కోళీకోడ్‌ విమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ దీపక్‌ వసంత్‌ సాథే (59) దుర్మరణంతో ఆయన తల్లిదండ్రులు తీరని విషాదంలో మునిగిపోయారు. వృద్ధాప్యంలో తమకు కొండంత అండగా ఉన్న తమ అభిమాన దీపక్ ఇకలేడన్న వార్త వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొంతకాలం క్రితం జరిగిన ప్రమాదంలో తమ మరో కుమారుడిని ఈ దంపతులు కోల్పోవడం విషాదం. (ఆయన ధైర్యమే కాపాడింది!)

"నా కొడుకు చాలా గొప్పవాడు. అవసరమైనవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వాడు'' అంటూ తల్లి నీలా సాథే దివంగత కెప్టెన్ దీపక్ సాథేని గుర్తు  చేసుకున్నారు. కళ్ల నిండా నీళ్లతో, విషణ్ణ వదనాలతో మీడియాతో  మాట్లాడిన మాటలు  హృదయాలను ద్రవింప చేస్తున్నాయి. తమ కుమారుడు అన్ని విద్యల్లో ఆరితేరిన వాడంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. మంచివారినే ఆ దేవుడు తీసుకెళ్లి పోతారని ఆమె వ్యాఖ్యానించారు. తమ ఇద్దరు కుమారులు ఇలా తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోవడాన్ని మించిన విషాదం ఏముంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  (విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో? )

మరోవైపు కెప్టెన్ సాథేతో తమ అనుబంధాన్ని తలుచుకుంటూ, ఆయన అభిమానులు, సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ప్రమాదానికి ముందు కెప్టెన్ సాథే ఇంజీన్  ఆపివేసి తద్వారా ప్రయాణీకులు,  సిబ్బంది ప్రాణాలను కాపాడారంటూ నివాళులర్పిస్తున్నారు. 

మరిన్ని వార్తలు