Mysterious Metal Balls In Gujarat: ఒకే చోటు పడుతున్న మిస్టరీ బాల్స్‌.. తీవ్ర ఆందోళనలో గ్రామస్తులు

16 May, 2022 16:21 IST|Sakshi

Mysterious metal balls raining..ఆకాశం నుంచి అంతుచిక్కని రీతిలో లోహపు గోళాలు భూమిపై పడుతున్నాయి. తీరా వాటి దగ్గరికి వెళ్లి చూశాక అవి ఈకల రూపంలో తీగలు బయటకు రావడం కలకలం సృష్టించింది. గుజరాత్‌ వరుసగా ఇలాంటి గోళాలు పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

అయితే, సురేంద్ర నగర్ జిల్లాలోని సాయిలా గ్రామంలో సోమవారం కొన్ని లోహపు గోళాలు కనిపించాయి. ఈ లోహపు గోళాలు అక్కడ పడిపోయాయని సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. కాగా, గోళాలు ఈకల రూపంలో తీగలుగా ఉండటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక, చాలా వరకు ఈ లోహపు గోళాలు నిర్మానుష్య ప్రాంతంలో ఒకే చోట పడిపోవడంతో అవి ఆకాశం నుంచే పడ్డాయన్న అభిప్రాయానికి వచ్చారు. 

దీంతో, ఈ వ్యవహారాన్ని తేల్చడానికి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ నిపుణులను సమాచారం అందించారు. ప్రభుత్వ పరిధిలోని ఈ సంస్థ నిపుణులు అంతరిక్షంపై స్పేస్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ నిపుణులు లోహపు గోళాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇవి భూమికి సమీప కక్షలో తిరుగుతున్న శాటిలైట్ శకలాలే అయి ఉంటాయని వారు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. 

ఇదిలా ఉండగా.. కొద్ది రోజల క్రితం గుజరాత్‌లో ఆనంద్‌ జిల్లాలోని భలేజ్‌, ఖంబోలాజ్‌, రాంపుర గ్రామాల్లో సుమారు 5 కిలోల బరువున్న మెటల్‌ బాల్స్‌ మొదటిసారిగా ఆకాశం నుంచి భూమిపై పడ్డాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 

ఇది కూడా చదవండి: ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్‌ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్‌


 

>
మరిన్ని వార్తలు