తండ్రి మైనపు విగ్రహం పక్కనే.. డాక్టర్‌ అపూర్వతో యతీష్‌ వివాహం

8 May, 2022 15:27 IST|Sakshi
తండ్రి మైనపు విగ్రహం ఎదుట తనయుడి పెళ్లి

సాక్షి, మైసూరు: దివంగతులైన తండ్రికి మైనపు విగ్రహం చేయించి ఆప్రతిమ ఎదురుగానే తాను ఇష్డపడిన యువతిని పెళ్లి చేసుకున్నాడు తనయుడు. ఈ అపూర్వ ఘట్టం మైసూరు జిల్లా నంజనగూడు పట్టణంలోని సంతాన గణపతి కల్యాణమండపంలో శనివారం చోటు చేసుకుంది. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అజ్జంపుర గ్రామానికి చెందిన రమేష్‌ కరోనా సెకండ్‌వేవ్‌లో మృతి చెందారు. ఈయన కుమారుడు యతీష్‌ మైసూరులో ఆయుర్వేద వైద్య కళాశాలలో ఎండీ కోర్సు చేస్తున్నాడు.

నంజనగూడు తాలూకా మేల్కుండి గ్రామానికి చెందిన డాక్టర్‌ అపూర్వతో యతీష్‌కు వివాహం నిశ్చయమైంది. తండ్రి ఎదుటనే వివాహం చేసుకోవాలని భావించిన యతీష్‌.. మైనపు విగ్రహం చేయించాడు. శనివారం విగ్రహాన్ని కల్యాణమండపానికి తీసుకొచ్చి ఆయన కళ్లెదుటే అపూర్వ మెడలో తాళి కట్టాడు. అనంతరం తండ్రి మైనపు విగ్రహం పక్కనే ఆసనం వేసి అందులో తల్లిని కూర్చోబెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.    

చదవండి: (ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్కిటెక్చర్‌ దుర్మరణం)

మరిన్ని వార్తలు