స్టార్‌ సింగర్‌ రేంజ్‌లో పాడాడు..ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి మంత్రి ఫిదా!

18 Jan, 2023 17:17 IST|Sakshi

చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలు చూసి ఉంటాం. వాటిల్లో వాళ్ల అమ్మనాన్నలు లేదా గురువులు వారి చేత దగ్గరుండి పాడించటం లేదా డ్యాన్సులు చేయించడం వంటివి చేస్తారు. అప్పుడూ ఎవరైన ధైర్యంగా చేయడం వేరు. కానీ ఇక్కడొక బుడ్డోడు మాత్రం పాఠశాలలో తన క్లాస్‌మేట్స్‌ అందరి ముందు ఏ మాత్రం బెణుకులేకుండా భలే అద్భుతంగా పాట పాడాడు.

అతను పాడే విధానం ఏదో ఒ​‍క పెద్ద స్టార్‌ సింగర్‌ మాదిరి ఓ రేంజ్‌లో మంచి కాన్ఫిడెన్స్‌తో పాడాడు. దీన్ని చూసి నాగాలాండ్‌ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్‌జెన్‌ ఇమ్నా అలోంగ్‌ ఫిదా అయ్యారు. ఇలాంటి ఆత్మవిశ్వాసమే జీవితంలో కావలని క్యాప్షెన్‌న్‌ జోడించి మరీ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజన్లు ఆత్మివశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు, దానిని ఎదుర్కొంటూ ముందుగు సాగే సామర్థ్యం! అని చెబుతూ ఆ పిల్లవాడికి హ్యాట్సాప్‌ అంటూ  ప్రశంసిస్తూ.. ‍ట్వీట్‌ చేశారు. 

(చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు