Nagaland:రూ. 29 కోట్ల ఖరీదు చేసే బంగారం, డ్రగ్స్‌ పట్టివేత

5 Oct, 2021 19:04 IST|Sakshi

ఖుజమా-ఇంఫాల్‌  జాతీయ రహదారిలోనే స్మగ్లింగ్‌ అధికం

గౌహతి: కోహిమాలోని ఖుజమాలో నార్కోటిక్ చెక్ పాయింట్‌ వద్ద చేసిన తనిఖీలలో సుమారు 48 కిలోల బంగారం, రూ. 29 కోట్ల ఖరీదు చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గత మూడు రోజులగా నార్కోటిక్ చెక్ పాయింట్‌లలో నిర్వహించిన తనిఖీలో ఇవి వెలుగు చూశాయి అని చెప్పారు.

(చదవండి: ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!)

ఈ సందర్భంగా నాగాలాండ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ ఎం తమ్‌గాడ్గే మాట్లాడుతూ...."రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా స్మగ్లింగ్‌ కోహిమాలోని ఖుజమా-ఇంఫాల్‌  జాతీయ రహదారిలోనే ఎక్కువగా  జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌ నిందుతులైన సౌరభ్ సింగ్, పవన్ కుమార్‌లకు సంబంధించిన వాహనంలోని గేర్‌లో 29 ప్యాకెట్లో రూ.22 కోట్లు ఖరీదు చేసే 10 బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నాం. దాదాపు ఆరు కోట్లు ఖరీదు చేసే హెరాయిన్‌ వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం" అని చెప్పారు. మయాన్మార్‌ నుంచి సరిహద్దు ప్రాంతాలైన ఈశాన్యా ప్రాంతాలకు తరుచుగా మాదక ద్రవ్యాలు, ఆయుధ సామాగ్రీని అక్రమంగా  తరలిస్తున్నారని అస్సాం రైఫిల్స్  బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు వెల్లడించారు.

(చదవండి: మిస్‌ వరల్డ్‌ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్‌)

మరిన్ని వార్తలు