నువ్వు గ్రేట్‌ గురు! వీధి కుక్కలకు చికెన్‌ బిర్యానీ

20 May, 2021 17:48 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ కారణంగా దేశంలో ఇప్పటికే అధిక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా వల్ల ఆరోగ్యపరంగానే కాదు ఆర్థికంగాను తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కొంత మంది ఇతరులకు సహాయం చేస్తూ మానవత్వానికి మరో పేరులా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సుమారు 200 వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నాడు. అది కూడా చికెన్‌ బిర్యానీతో వాటి కడుపు నింపడం విశేషం. 

వివరాల్లోకి వెళితే..  మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రంజిత్ నాథ్ రోజూ దాదాపు 40 కిలోల బిర్యానీ వండుకుని నగరంలోని పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఆహారాన్ని అందిస్తున్నాడు. లాక్‌డౌన్ మొదలయిన తర్వాత జంతువులకు ఆహారం దొర​‍కడం కష్టమైంది. వాటిని చూసి ఎంతో చలించిపోయారు రంజిత్. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు.

నాగ్‌పూర్‌లో వీధి కుక్కలు, పిల్లులకు ప్రతి రోజు అన్నం పెట్టేందుకు ముందుకొచ్చారు. అలా అప్పటి నుంచి ప్రతి రోజు దాదాపు 200 వరకు వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ పెడుతూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు. బుధవారం ఓ పత్రిక సంస్థతో రంజిత్‌ మాట్లాడుతూ.. ‘నేను ఈ కుక్కల కోసం ప్రతీ రోజు 30-40 కిలోల చికెన్‌ బిర్యానీని సిద్ధం చేసుకుంటాను. వీధి జంతువులను నా పిల్లల్లాగే భావిస్తాను. నేను జీవించి ఉన్నంత వరకు ఈ పని చేస్తుంటాను. పైగా ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపాడు. నా పని మధ్యాహ్నం వంటతో మొదలై.. ఇలా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకు బైక్ మీద నగరం చుట్టూ తిరిగి పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు భోజనం పెట్టి వాటి ఆకలిని తీర్చడంతో నా పని పూర్తి అవుతుంద’ని అన్నాడు.

చదవండి: మహిళను కాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ

మరిన్ని వార్తలు