సవాళ్లకు నిలిచిన ఇండో– రష్యా స్నేహం

4 Sep, 2021 04:17 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్, రష్యాల స్నేహబంధం కాలపరీక్షను తట్టుకొని నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రెండు దేశాలు కలిసి ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వం తెస్తాయని అభిలíÙంచారు. రష్యాలోని వ్లాడివోస్టోక్‌ నగరంలో జరుగుతున్న ఈఈఎఫ్‌(ఈస్ట్రన్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌) సమావేశాలనుద్దేశించి ఆయన ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. కరోనా సమయంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరిగిందని మోదీ చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పుతిన్‌ చేపడుతున్న చర్యలను మోదీ కొనియాడారు. ఈ విషయంలో రష్యాకు భారత్‌ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందన్నారు.

రష్యాలో సహజవనరులున్నాయని, భారత్‌లో మానవవనరులున్నాయని, రెండూ కలిసి అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. యాక్‌ ఫార్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా 2019లో జరిపిన రష్యా పర్యటనను ఆయన గుర్తు చేసుకున్నారు. రష్యాతో కీలక, నమ్మక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంలో ఈ పాలసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కరోనాతో వైద్యారోగ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత తెలియవచి్చందన్నారు. అగ్రో, సెరామిక్స్, రేర్‌ఎర్త్‌ మినరల్స్, డైమండ్స్‌ తదితర రంగాల్లో కొత్త అవకాశాలను ఇరుదేశాలు అన్వేíÙస్తున్నాయని చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతానికి చెందిన 11 ప్రాంతాల గవర్నర్లను భారత్‌లో పర్యటించాలని మోదీ ఆహా్వనించారు.

మరిన్ని వార్తలు