బస్‌ కండక్టర్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు 

29 Mar, 2021 07:07 IST|Sakshi

సాక్షి, టీ.నగర్‌: మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కోవై బస్‌ కండక్టర్‌కు ప్రశంసలందించారు. ఆయన మాట్లాడుతూ కోవైలో బస్‌ కండక్టర్‌ యోగనాథన్‌ ప్రయాణికులకు టికెట్‌తోపాటు మొక్కలను అందజేస్తున్నారని, తన ఆదాయంలో అధిక భాగాన్ని ఇందుకోసం వినియోగిస్తుండడం ప్రశంసనీయమన్నారు. ఈ విధంగా మోదీ తెలిపారు. ఇది విన్న యోగనాథన్‌ సంతోషం వ్యక్తం చేశారు.  విలేకరులతో యోగనాథన్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ తనను ప్రశంసించడం సంతోషంగా ఉందని, ప్రోత్సాహకరంగా ఉందన్నారు. తనలా ఎందరో మొక్కలను నాటే పనుల్లో నిమగ్నమవుతారన్నారు. 

తనకు వచ్చే ఆదాయంలో 40 శాతాన్ని మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. 34 ఏళ్లుగా కండక్టర్‌గా పనిచేస్తున్న తాను ఇంతవరకు మూడు లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు తెలిపారు. గత ఏడాది 85 వేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. యోగనాథన్‌ ఇప్పటి వరకు అనేక అవార్డులను అందుకున్నారు. సీబీఎస్‌ఈ ఐదో తరగతి పాఠ్యాంశంలోను ఈయన చోటుచేసుకున్నారు. ఇప్పటి వరకు అద్దె ఇంట్లో నివసిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చదవండి: విజయవాడ వాసికి నా అభినందనలు: పీఎం మోదీ

మరిన్ని వార్తలు