ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది!.. ఆర్‌ఆర్‌ఆర్‌ గోల్డెన్‌ గ్లోబ్‌పై ప్రధాని మోదీ

11 Jan, 2023 13:29 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని నాటునాటు సాంగ్‌కి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీంపై ట్విట్టర్‌ వేదికగా ప్రసంశల జల్లు కురిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందంటూ నటినటులను, చిత్ర బృందాన్ని పేరుపేరున అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ట్విట్టర్‌లో ఈ చిత్ర నటీనటులు, సిబ్బందిని అభినందించారు. మన కళకు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందడం కంటే మన దేశం గర్వించదగ్గ క్షణం మరోకటి ఉండదు అని అన్నారు. కాగా, రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లోని 'నాటు నాటు' పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది.

అంతేగాదు ఈ చిత్రం ఉత్తమ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయ్యి ఈ అవార్డును గెలుపొందింది. దీంతో ఇప్పటికే పలువురు పలువురు ప్రముఖులు ఆ సినీ చిత్ర బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును ఒక భారతీయ సినిమా దక్కించుకోవడం విశేషమైతే, ఆ ఆవార్డును దక్కించకున్న తొలి ఏషియన్‌ సినిమాగానూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిలిచింది.

(చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డు రావడం గర్వంగా ఉంది.. చిత్ర బృందానికి ఏపీ సీఎం జగన్‌ అభినందనలు)

మరిన్ని వార్తలు