PM Narendra Modi: చెత్తను ఏరిన ప్రధాని మోదీ.. నెటిజన్ల ప్రశంసలు

19 Jun, 2022 15:01 IST|Sakshi

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రధాని నరేంద్ర మోదీ స‍్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా, స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగరాలను శుభ్రంగా ఉంచాలని మోదీ పిలుపునిచ్చారు. 

అయితే.. తాజాగా ప్రధాని మోదీ మరోసారి స్వచ్ఛ స్పూర్తిని చాటుకున్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీనే స్వయంగా చెత్త ఏరివేసి దేశ ప‍్రజలకు మరోసారి 'స్వచ్ఛ భారత్‌' సందేశాన్ని వినిపించారు. కాగా, మోదీ.. ఆదివారం ఢిల్లీలో నిర్మించిన 'ప్రగతి మైదాన్‌ సమీకృత ట్రాన్స్‌పోర్ట్‌ టన్నెల్‌'ను ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను మోదీ పరిశీలించారు.

ఈ సందర్భంగా మోదీ అక్కడ కొంద దూరం ముందుకు సాగారు. ఈ క్రమంలో మోదీ.. అక్క​డ కనిపించిన చెత్త, ప్లాస్టిక్‌ సీసాను తన చేతులతో ఎత్తారు. అనంతరం పరిశుభ్రతను పాటించాలని చాటి చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం.. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ ప్రాంతంలో కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ) తదితర ఏజెన్సీల ముఖ్య కార్యాలయాలు అక్కడ ఉండటంతో సందర్శకులు ఎటువంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చేసేందుకు చర‍్యలు తీసుకుంది. అందులో భాగంగానే రూ.920 కోట్లతో 'ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా కారిడార్‌'ను నిర్మించింది. 

మరిన్ని వార్తలు