వందేళ్ల ఆనందంలో రూ.100 నాణేం

25 Nov, 2020 20:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లక్నో విశ్వవిద్యాలయం 100 ఏళ్ల శంకుస్థాపన దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యూనివర్సిటీలలో కోర్సుల రూపకల్పనలో  తగిన జాగ్రత్తలు తీసుకొవాలని సలహా ఇచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసగించారు. డిజిటల్​ పరికరాలకు, సామాజిక మాధ్యమాలకు ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తున్నారని.. సొంత విషయాలను కూడా చూసుకోవాలని సూచించారు. తమను తాము తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని.. అత్మవిశ్వాసం, సామర్థ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. స్థానిక వస్తువులను ప్రోత్సహించేలా కోర్సులు ఎందుకు రూపొందించకూడదని వర్సీటీ ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ వేడుక సందర్భంగా ప్రత్యేక స్టాంప్​తో పాటు రూ.100  నాణాన్ని ఆయన విడుదల చేశారు. 

కాగా, నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి డిసెంబర్​లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలో ఉన్న 5 విగ్రహాలను తాత్కాలికంగా తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట్లో డిసెంబర్ 10న శంకుస్థాపన తేదీగా అధికారులు ప్రతిపాదించారు. అయితే ప్రధాని అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి తుది తేదీని ఖరారు చేయనున్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా