వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు : మోదీ

16 Oct, 2020 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ బిల్లులు రైతుల ఆదాయాలను పెంచేందుకు ఉపకరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడిఉందని ఆయన పేర్కొన్నారు. దేశ ఆహార భద్రతకు మద్దతు ధర వ్యవస్థ కీలకమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భగా 75 రూపాయల ప్రత్యేక నాణేన్ని ఆయన విడుదల చేశారు.

దేశ ఆహారభద్రతకు మద్దతు ధర, ఆహారోత్పత్తుల సేకరణ కీలకమని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో మెరుగైన సదుపాయాలతో వీటి నిర్వహణ చేపట్టడం అవసరమని నొక్కిచెప్పారు. ఈ విధానాన్ని కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మద్దతు ధర విధానం కొనసాగిస్తూనే రైతులు వారి ఉత్పుత్తుల విక్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులను బలోపేతం చేసేందుకు ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనేజేషన్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. చదవండి : సొంత కారులేదు.. అప్పులూ లేవు

మరిన్ని వార్తలు