10 రాష్ట్రాల్లో కట్టడి అవసరం: మోదీ

12 Aug, 2020 03:56 IST|Sakshi

కలసికట్టుగా కరోనా కొమ్ములు వంచుదామన్న ప్రధాని

న్యూఢిల్లీ: కలసికట్టుగా కరోనాపై పోరాటం చేద్దామని ప్రధాని  మోదీ  ముఖ్యమంత్రులకు పిలుపు నిచ్చారు. కోవిడ్‌  కేసులు అత్యధికంగా ఉన్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో సమీక్షిం చారు. మొత్తం కేసుల్లో 80 శాతంపైగా నమోదవుతున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు కరోనాని కట్టడి చేస్తే, భారత్‌ ఈ మహమ్మా రిపై విజయం సాధి స్తుందని అన్నారు.

సమావేశంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  ఎవరికైనా వైరస్‌ సోకిందని నిర్ధారణ అయ్యాక ఆ వ్యక్తిని కలుసుకున్న వారందరినీ 72 గంట ల్లోగా గుర్తించి పరీక్షలు చేస్తే కేసుల్ని గణనీ యంగా అడ్డుకోవచ్చునన్నారు. తెలంగాణ, బిహార్, గుజరాత్, యూపీ, బెంగాల్‌లలో కరోనా పరీక్షల్ని విస్తృతంగా చేపట్టాలన్నారు.

>
మరిన్ని వార్తలు