దేశ ప్రగతికోసం అగ్నిపథ్‌లో నడుస్తున్నారు మోదీ!

19 Jun, 2022 19:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్‌ పై నడిచారంటూ బీజేపీ అధికార ప్రతినిధి మోదీపై ప్రశంసల జల్లు కరిపించారు. ఈ అగ్నిపథ్‌ పథకం పై పెద్ద ఎత్తు ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో... సంస్కరణలు, పనితీరులో మార్పులు రూపాంతరం చెందకపోతే భారత్‌ ఎలా గొప్పగా మారుతుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ మేరకు అగ్నిపథ్ పథకానికి సంబంధించి భారత సాయుధ బలగాల ఉన్నతాధికారులతో జరిగిన మీడియా సమావేశం బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ సమావేశంలో సంబిత్‌ పాత్రా మాట్లాడుతూ...లెఫ్టినెంట్ జనరల్ పూరి ఆర్మీ కాన్ఫరెన్స్‌లో అగ్నిపథ్ కార్యక్రమాన్ని వివరించిన తీరు.. అందులో ఎలాంటి సందేహం లేదని అనుకుంటున్నా. కొన్ని విషయాల్లో రాజకీయాలు ఉండకూడదని చెప్పడం బాధాకరమన్నారు. జాతీయ విధానాలపై కూడా దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. ఆర్మీ అధికారులు ముందుకు వచ్చి ఈ దేశంలో కాల్పులకు, హింసకు తావు లేదని, హింసకు పాల్పడవద్దని నిరసనకారులకు చెప్పాలి.  భారతదేశ ప్రగతి కోసం మోదీ అగ్నిపథ్‌లో నడవడం చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ జాతీయవాదాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆ సమావేశంలో ఒక సీనియర్‌ ఆర్మీ అధికారి మాట్లాడుతూ..."ఈ పథకాన్ని వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారు. దేశాన్ని యవ్వనంగా మార్చడానికి ఇదోక ప్రగతిశీల. మేము జాతీయ భద్రతలో తలామునకలవుతున్నాం, మాకసలు తీరికనేది ఉండేదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నా...ఎత్తైన ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నప్పుడు ఆరోగ్యం పై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా అని ప్రశ్నించారు. ఏటా చాలా మంది ఈ ప్రాంతాల్లో చనిపోతున్నారు. ఎంత ప్రాణ నష్టం వాటిల్లుతోందో కూడా మీకు తెలియదు. ముందు వీటి గురించి కూలంకషంగా తెలుసుకోండి. ఆ తర్వాత యువత ఎందుకు ముఖ్యమో మీకు అర్థమవుతుంది." అని అన్నారు.

(చదవండి: అగ్నిపథ్‌పై కీలక ప్రకటన)

మరిన్ని వార్తలు