ప్రధాని చిన్ననాటి గురువు మృతి...సంతాపం వ్యక్తం చేసిన మోదీ

27 Nov, 2022 18:41 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి పాఠశాల టీచర్‌ రాస్విహారి మణియార్‌(94) కన్నుమూశారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లోని బీఎన్‌ విద్యాలయంలో రాస్విహారి ప్రిన్స్‌పాల్‌గా చేసి పదవీ విరమణ చేశారు. ఈ పాఠశాలలోనే ప్రధాని మోదీ చదువుకున్నారు. మోదీ ఆయన మరణం గురించి తెలుసుకుని చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు మోదీ మాట్లాడుతూ...నా గురువు మణియార్‌ మరణం గురించి విని చాలా బాధపడ్డాను. నాజీవితంలో ఆయన చేసిన అమూల్యమైన సహకారం ఎప్పటికీ మరిచిపోను.

‘నా జీవితంలో ఈ దశ వరకు కూడా ఆయనతో కనక్ట్‌ అవుతూనే ఉన్నాను. విద్యార్థిగా నా జీవితాంతం ఆయన మార్గదర్శకత్వం పొందడం పట్ల నేను సంతృప్తి చెందాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మోదీ తన చిన్ననాటి గురువుని సత్కరిస్తున్న వీడియోతో పాటుగా ఆయనతో కలిసి దిగిన ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నారు. మోదీ అవకాశం వచ్చినప్పుడల్లా తన గురువు గురించి తన ప్రసంగంలో ప్రస్తావిస్తుంటారు. ముఖ్యంగా గుజరాత్‌ పర్యటనలో ఉన్నప్పుడల్లా తన గురువులను కలిసేందుకు ప్రయత్నించేవారు. అంతేగాదు ఆయన గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడూ అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ కాలేజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన ఉపాధ్యాయులను సత్కరించారు కూడా. 
 

(చదవండి: జోడో యాత్రలో రాహుల్‌ బైక్‌ రైడ్‌)

మరిన్ని వార్తలు